కొటియా ఓటర్లపై గురికిందకు దించేందుకు సన్నాహాలు

May 12,2024 21:15

సాలూరు: వివాదాస్పద కొటియా గ్రామాలకు సంబంధించిన ఓటర్లపై అధికారపార్టీ నాయకులు గురి పెట్టారు. శిఖపరువు, నేరళ్లవలస పోలింగ్‌ కేంద్రాలకు రావాల్సిన ఓటర్లను కొండలపై నుంచి కిందకు దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టుచెన్నూరు, పగులచెన్నూరు గ్రామాలకు చెందిన గిరిజన ఓటర్లు శిఖపరువు పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. పట్టు చెన్నూరులో ఒడిశా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఓటు వేసి గిరిజన ఓటర్లు శిఖపరువులో ఓటు వేయడానికి వీలుపడదు. దీంతో పట్టు చెన్నూరు, పగుల చెన్నూరు గ్రామాల ఓటర్లను శిఖపరువు పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు తరలించారు. అలాగే కొటియా, ఎగువశెంబి, దిగువ శెంబి, గంజాయి భద్ర, దూళిభద్ర గ్రామాల ఓటర్లను నేరెళ్లవలస పోలింగ్‌ కేంద్రం వద్దకు దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొటియా గ్రామాల ఓటర్లతో ముందు ఎపి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయించేలా అధికారపార్టీ నాయకులు ప్రయత్నించారు. 21 కొటియా గ్రామాలకు చెందిన మొత్తం 2500

➡️