ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రభుత్వ ఐటిఐలో పని చేయని మిషనరీలు, టూల్స్ వేలం వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐటిఐల ఆర్‌డిడి ఆర్.వి.రమణ.. ప్రిన్సిపల్ రమణరావును ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐలో పని చేయని మిషనరీ, టూల్స్‌ను మూడు రోజుల నుంచి పరిశీలించారు. వాటిని ఆన్‌లైలో వేలం వేయాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. ఐటిఐలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
