మాధవికి రాధేయ కవితా పురస్కారం

Jun 9,2024 21:52

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఖమ్మం జిల్లాకు చెందిన కవయిత్రి ఫణి మాధవి కన్నోజుకు డాక్టర్‌ రాధేయ కవితా పురస్కారం లభించింది. స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ అధ్యక్షతన ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు అవార్డును కవి డాక్టర్‌ రాధేయ అందజేశారు. అనంతరం ప్రముఖ రచయితలు గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం సాహిత్యం ఎలా ఉంది? సాహిత్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశాల గురించి వివరించారు. సాహిత్యం తరతరాలకి కొనసాగాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ రాధేయ మాట్లాడుతూ కళింగాంధ్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు రచయితలు పాల్గొన్నారు.

➡️