ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ దంపతులతో విజయనగరంలో గల ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐటి అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి.అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ కిపివైజి రాజు, ది లాస్ట్ మహారాజ్ ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, ఎస్పీ, ఆర్డీవో, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.