ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రభుత్వ ఉపాధ్యాయ విద్య శిక్షణా సంస్థ (డైట్)లో మంగళవారం నిర్వహించిన రంగోత్సవ్ వేడుకలు ఆకట్టుకున్నాయి. పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. క్విజ్‌లో జరజాపుపేట జెడ్‌పి హైస్కూల్ ప్రథమ స్థానం, ఎపిఎంఎస్ మదనాపురం ద్వితీయ స్థానం, గొట్లాం తృతీయ స్థానం, డ్రాయింగ్ లో ఎంజెపి స్కూల్ నెల్లిమర్ల ప్రథమ స్థానం, చీపురుపల్లి జెడ్‌పిహెచ్‌ఎస్ ద్వితీయ స్థానం, గొట్లాం జడ్పిహెచ్‌ఎస్ తృతీయ స్థానం, చేతిరాతలో ఎపిఎంఎస్ మదనాపురం ప్రథమ, ఎంజెపి నెల్లిమర్ల ద్వితీయ, గొట్లాం జడ్పిహెచ్‌ఎస్ తృతీయ స్థానం సాధించాయి. రంగోలిలో ఎంజెపి నెల్లిమర్ల ప్రథమ, జరజాపుపేట జడ్పిహెచ్‌ఎస్ ద్వితీయ, గొట్లాం జడ్పిహెచ్‌ఎస్ తృతీయ, జానపద నృత్యంలో చీపురుపల్లి జడ్పిహెచ్‌ఎస్ ప్రథమ, నెల్లిమర్ల ఎంజెపి ద్వితీయ, ద్వారపూడి జడ్పిహెచ్‌ఎస్ తృతీయ స్థానం సాధించాయి. డిజిటల్ కాలేజ్ యూనిటీ, ఇంటిగ్రేట్ పోస్టర్‌లో మదనాపురం ఎపి ఎంఎస్ ప్రథమ, జరజాపుపేట జడ్పిహెచ్‌ఎస్ ద్వితీయ, రోల్ ప్లేలో గొట్లాం జడ్పిహెచ్‌ఎస్ ప్రథమ, మదనాపురం ఎపిఎంఎస్ ద్వితీయ, నెల్లిమర్ల ఎంజెపి తృతీయ స్థానం, ఏక్ భారత్ విశిష్ట భారత్ స్లొగన్స్‌లో గొట్లాం జడ్పిహెచ్‌ఎస్ ప్రథమ, వేణుగోపాలపురం జిపియుపి స్కూల్ ద్వితీయ, చీపురుపల్లి జడ్పిహెచ్‌ఎస్ తృతీయ స్థానం సాధించారు. ప్రథమ స్థానం సాధించిన వారు 8న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. పగడాలమ్మ, వైస్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు, స్టాఫ్ సెక్రటరీ డి. ఈశ్వర రావు, ఎల్.రామకృష్ణారావు పి.రవికుమార్, కె.సూర్యారావు, మాత రామకృష్ణ, వివిజె సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, భారతి తదితరులు పాల్గొన్నారు.