పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఆర్‌డిఒ

Feb 4,2025 21:12

ప్రజాశక్తి – వేపాడ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డిఒ దాట్ల కీర్తి మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లును పరిశీలిం చారు. ఈ పరిశీలనలో డిప్యూటీ తహశీల్దార్‌ డి.సన్యాసినాయుడు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మి పాల్గొన్నారు.గంట్యాడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనాన్ని మంగళవారం ఆర్‌డిఒ దాట్ల కీర్తి పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ పాఠశాలను పోలింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పరిశీలించినట్లు ఆమె తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్లు తదితర మౌళిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆమె వెంట తహశీల్దార్‌ నీలకంఠేశ్వర రెడ్డి, బిఎల్‌ఒలు, పాఠశాల హెచ్‌ఎం తదితరులు ఉన్నారు.కొత్తవలస: స్థానిక జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కేంద్రాన్ని ఆర్‌డిఒ కీర్తి మంగళవారం తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ బి. నీకంఠారావు, హై స్కూల్‌ హెచ్‌ఎం గోవింద నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️