ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తాటిపూడి పాత బ్రిడ్జి వద్ద ఏర్పడిన పైపులైను మరమ్మత్తు పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. పైప్ లైన్ లీకవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు స్పందించిన కమిషనర్ హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేశారు. తాటిపూడి పాత బ్రిడ్జి వద్దకు చేరుకొని పైప్ లైన్ లికుల మరమ్మత్తు పనులను సరి చేశారు. దీంతో నీటి పంపిణీకి మార్గం సుగమమైంది.