రహదారులను పరిశుభ్రంగా ఉంచాలి

Oct 3,2024 21:24

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పరిధిలో రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని, అపరిశుభ్రం చేస్తే అపరాధ రుసుం వేస్తామని కమిషనర్‌ పి.నల్లనయ్య అన్నారు. గురువారం నగరంలో పర్యటించి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికై సిబ్బందికి తగు సూచనలు చేశారు. తోట పాలెం, విటి అగ్రహారం, వుడా కాలనీ ఫేస్‌ 1,2 కాళీఘట్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు సమస్యలపై సిబ్బందికి సూచించా రు. విటి అగ్రహారం పార్కు వద్ద అనధికారికంగా వాహనాలు నిలుపుదల చేయడానికి గమనించి తక్షణమే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. పార్కు చుట్టూ మొక్కలు, పొదలు తొలగించి వేయాలని చెప్పారు. ఉడా కాలనీ లో ఉన్న పార్కు చుట్టూ జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సమస్యల పరిష్కారానికే వార్డు సందర్శనవార్డు పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, వివిధ విభాగాల అధికారులు 11వ డివిజన్లో పర్యటించారు. అంబటిసత్రం జంక్షన్‌ నుండి ప్రారంభమైన వార్డు పర్యటన చందాల వీధి, కోట్ల మాదప్ప వీధి తదితర ప్రాంతాలలో సాగింది. అక్కడక్కడ సమస్యలను ప్రజలు అధికారులు దష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగాదాయన మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎసిపి మధుసూదన్‌ రావు, ఎఒ సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️