16న విజయనగరం సమగ్ర అభివృద్ధికి రౌండ్ టేబుల్ సమావేశం

Mar 12,2025 13:33 #Vizianagaram district

పట్టణ పౌర సంక్షేమ సంఘం పిలుపు
గోడ పత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం సమగ్ర అభివృద్ధి కోసం 10 వేలు కోట్లు కేటాయించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 16న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనీ జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం చైర్మన్ ,పూర్వ అర్ డబల్యూ ఎస్ రిటైర్డు ఎస్ఈ కె.శివా నందుకుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్యాపక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి వి పి. జైపాల్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో జ్యూట్, పంచదార,
ఫేరో ఎల్లయ్యస్ పరిశ్రమలు మూతపడ్డాయి. 50 వేలు మంది కార్మికులు బతుకులు పోయాయన్నారు. వీధిన పడిన కార్మికులు ఉపాధి కోసం వలసలుపోయారన్నారు.
జిల్లాలో నీటివనరులు ఉన్నా ప్రాజెక్టు లు నిర్మించడం లేదన్నారు. తారక రామా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు, మెడికల్ కళాశాలలో, తగిన స్టాఫ్ లేరు, సౌకర్యాలు లేవు, కేన్సర్ టెస్టoగు సెంటర్ లేదు, కార్డియాక్ సెంటర్, యూరలజి, న్యూరా లాజి సౌకర్యం లేవన్నారు. జిల్లాలో 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే 3 కళాశాలలకూ శాశ్వత భవనాలు లేవని, అన్ని విధాలా విజయ నగరం అభివృద్ధిలో వెనుక బడి ఉందని అని అన్నారు. సాంస్కృతిక రాజధానిగా విజయనగరం పేరు గాంచిన సాంస్కృతిక విశ్వ విద్యాలయం, సాంస్కృతిక మ్యూజియం క్రీడా హాబ్, తదితర అవకాశాలు ఉన్నాయన్నారు. అయినా వాటి ఏర్పాటుకు ఎవ్వరూ ప్రయత్నం చెయ్యడం లేదన్నారు. మామిడి, జీడి, చింత పండు, ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్ట వచ్చు, జూట్ పరిశ్రమను బట్టల తయారీకి ఉపయోగించే పరిశ్రమగా మార్చాలాన్నారు. ఇటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేసి విజయనగరం సమగ్ర అభివృద్ధి చెయ్యాలని, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కోసం, మురికి వాడల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విజయనగరం సమగ్రాభివృద్ధి కి 10 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ మార్చి 16న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశా మని ఇందులో అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు, పాల్గొనున్నారన్నారు. అనంతరం గోడ పత్రికను విడుదల చేశారు.విలేకర్ల సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం శ్రీనివాసవాసా, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు, పాల్గొన్నారు.

➡️