ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : విజయనగరం క్యాంప్ ఆఫీస్ లో ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డి వి జి శంకరరావును జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ అధికారి లక్ష్మణరావు మర్యాద పూర్వకంగా కలిసి ముందుగా భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో విద్యుత్ సదుపాయాలు, లక్ష్యాలు, గిరిజన గ్రామాలకు, వ్యక్తిగత లబ్దిదారులకు ఉచితంగా అందించనున్న సోలార్ ప్యానెల్ ఏర్పాటు పథకం, పిఎం సోలార్ ఘర్ స్థితిగతులపై చర్చించారు. జిల్లా అధికారితో పాటు డిఇఇ కె.కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.