ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సంక్రాంతి నేపథ్యంలో ఐద్వా ఆధ్వర్యాన శనివారం రామకృష్ణా నగర్‌లో ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్, కట్చీఫ్ గేమ్, అంత్యాక్షరీ తదితర ఆటలు ఆడించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా పిల్లలకు క్రీడాఫోటీలు నిర్వహించడం ద్వారా వారిలో మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వి.లక్ష్మి, నాయకులు ఎం.జగదాంబ, కె.రమణమ్మ, డి.కరుణ తదితరులు పాల్గొన్నారు.