ఘనంగా వసంత పంచమి వేడుకలు

Feb 3,2025 19:43

ప్రజాశక్తి- విజయనగరంకోట : వసంత పంచమి సందర్భంగా రెండో బాసరగా ప్రసిద్ధి గాంచిన విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సోమవారం సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి సైతం వేలాదిగా తరలి వచ్చారు. రెండు నెలల ముందు నుంచే అక్షరాభ్యాసాల కోసం టోకెన్లు పొందడంతో ఆదివారం రాత్రికే ఇతర ప్రాంతాల వారంతా విజయనగరం చేరుకున్నారు. ఈనేపథ్యంలో జిల్లా కేంద్రంలో హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడాయి. సోమవారం వేకువ జాము నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమై బ్యాచ్‌ల వారీ సాయంత్రం వరకు కొనసాగాయి.

➡️