ఎస్ టి యు నూతన కార్యవర్గం 

Feb 10,2024 16:19 #Vizianagaram
stu new committee

జిల్లా అధ్యక్షుడు గా కే.జోగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గా సిహెచ్.సూరిబాబు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్ టి యు) విజయనగరం జిల్లా కౌన్సిల్ మరియు నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక అమర్ భవన్ విజయనగరంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల పరిశీలకులుగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి.దేవుడు బాబు హాజరయ్యారు. 2024-25 గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు: కే. జోగారావు,
ప్రధాన కార్యదర్శిగా సిహెచ్.సూరిబాబు. ఆర్థిక కార్యదర్శి: బి.ఈశ్వరరావు,
సంయుక్త అధ్యక్షులు : ఎస్.చిట్టిబాబు, ఎం మురళి,
ఉపాధ్యక్షులు : ఎంవి లక్ష్మీనరసయ్య.
ఏ.నాగేశ్వరరావు., డి సరస్వతి
పి.రాజ్యలక్ష్మి, ఎంఏ స్వామి.
అదనపు ప్రధాన కార్యదర్శి: పెంకి.రాంబాబు, జి రవి కార్యదర్శులుగా మోపాడ.తులసీరామ్, శ్రీనివాస దొర, సౌదామిని, యస్ మహేష్
వి మల్లేశ్వరరావు బి అర్జునుడు
బి అడివయ్య, ఎస్ బంగారయ్య, మహిళా కన్వీనర్: నాగేశ్వరి
మైనారిటీ కన్వీనర్: రహీం
సిపిఎస్ కన్వీనర్: కే రమేష్
ఆర్థిక కమిటీ సభ్యులు: బి రమణ,ఆర్ వాసుదేవరావు,
మోడల్ స్కూల్ కన్వీనర్: కే.చంద్రశేఖర్
రాష్ట్ర కౌన్సిలర్: డి శ్యామ్
వి గోవిందరావు.
నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల పరిశీలకులు పి.దేవుడు బాబు ప్రమాణ స్వీకారం చేయించారు.  అనంతరం జిల్లా అధ్యక్షులు కే.జోగారావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సిపిఎస్ విధానంపై తమ వైఖరి ప్రకటించాలని రానున్న ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓ పి ఎస్ విధానాన్ని సంఘాలుగా తీసుకుంటామని తెలిపారు, అలాగే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా ప్రధాన ప్రధాన సిహెచ్ సూరిబాబు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలి, అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేసారు, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా మండల కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

➡️