మహిళా గర్జనను విజయవంతం చేయండి 

Sep 29,2024 11:53 #Vizianagaram district

మహిళా గర్జన గోడ పత్రిక ఆవిష్కరణ 

ప్రజాశక్తి-విజయనగరం కోట : మహిళా గర్జన ర్యాలీని విజయవంతం చేయాలని మహిళా గర్జన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు స్థానిక ఒక ప్రయివేటు హోటల్ మహిళా గర్జన కమిటీ, వాజీ చానల్ సంయుక్త నిర్వహణలో ముందు గా మహిళా గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మహిళా గర్జన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, హత్యలు, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️