16న సమ్మెను జయప్రదం చేయండి

Feb 12,2024 15:38 #Vizianagaram
success the strike on the 16th

సిఐటియు నగర కార్యదర్శి రమణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 16న జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీ ఐ టి యు నగర కార్యదర్శి బి రమణ పిలుపునిచ్చారు. సోమవారం రవాణా రంగ యజమానులు, డ్రైవర్లు, కార్మికుల సమస్యలపై ముద్రించిన కరపత్రాలను పట్టణంలో పలు ఆటో స్టాండ్ లో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రవాణా రంగంపై పెద్ద ఎత్తున దాడి చేస్తుందని, అందులో భాగంగానే భారత న్యాయ సంహిత చట్టం 106 (1&2) క్రిమినల్ చట్టాన్ని హిట్ అండ్ అని పేరుతో డ్రైవర్ల పై ప్రయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం రద్దు కోసం ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను జయప్రదం చేసేందుకు రేపు అన్ని మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు డ్రైవర్లు వర్కర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ దొర, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

➡️