ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 14న పిఠాపురంలోని చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి అధ్యక్షతన ఆదివారం విజయనగరం జిల్లా కేంధ్రంలోని ఐఎంఎ హాలులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సన్నాహాక సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ నుండి అత్యధికంగా అవిర్భావ సభకు హాజరై జిల్లా సత్తాను చాటుదామని అన్నారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను విడుదల చేశారు. సమావేశంలో జనసేన నాయకులు, పిఒసిలు సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ పరిధి లోని ఏడు నియోజకవర్గాల పిఒసి లు, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిసస్తాభోగాపురం: ఇళ్ల స్థలాల సమస్యను త్వరితిగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. భోగాపురంలోని ఎస్‌సి, బిసి కాలనీలో సుమారు 45 మంది ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలందరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల సమస్యను అధికారులతో మాట్లాడతానని అన్నారు. రహదారులు, శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, పడాల శ్రీనివాసరావు, పల్లంట్ల జగదీష్, పళ్ళ రాంబాబు, కర్రోతు శ్రీనివాసరావు, న్యాయవాది సుధాకర్, మాత నవీన్ పాల్గొన్నారు.
