ప్రజాశక్తి – రామభద్రపురం : ప్రజల ఆర్థిక పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రభుత్వ సూచనలతో సర్వేలు నిర్వహిస్తున్నామని ఎంపిడిఒ రత్నం తెలిపారు. బుదవారం ఆరికతోట గ్రామ పంచాయతీలో జరుగుతున్న పి4, డబ్ల్యుఎఫ్‌హెచ్ సర్వేలను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేలపై అపోహలు తగవు అని ప్రతీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి, ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేటుగా సహాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సర్వే డేటా అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ సర్వేలకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అనంతరం అంగన్వాడి సెంటర్‌ను సందర్శించి నిబంధనల మేరకు సెంటర్ పనితీరు, రికార్డులు విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని వేపాడలో నిర్వహిస్తున్న పి4 సర్వేను ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ బుధవారం పరిశీలించారు. సచివాలయ సిబ్బంది చేపట్టిన సర్వే వివరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, మండల స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్లు గొర్రె రాంబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
