వివాహిత అనుమానాస్పద మృతి

Oct 30,2024 20:51

 ప్రజాశక్తి- శృంగవరపుకోట : మండలంలోని సన్యాసయ్యపాలెం గ్రామానికి చెందిన దొడ్డ శ్రావణి (22) బుధవారం ఉదయం తన ఇంటిలో ఉరివేసుకోని మృతి చెందింది. ఈవిషయంపై స్థానికులు మట్లాడుతూ సదరు వివాహితకు ఏడాది క్రితం మండలంలోని రాజీపేట గ్రామానికి చెందిన దొడ్డ కిశోర్‌తో వివాహాం జరిగిందని అతను పాల వ్యాన్‌ నడుపుతాడని తెలిపారు. వివాహిత గత కొద్దికాలంగా తన కన్నవారింట సనాసయ్యపాలెంలో వుంటుందని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుందని తెలిపారు. బుధవారం ఉదయం తాను పాఠశాలకు వెళ్తానని క్యారియర్‌ కట్టాలనీ తన తల్లి లక్ష్మికి చెప్పిందని, కూతురుకు క్యారియర్‌ కట్టాక తన భర్త జగన్నాదంతో పోలానికి తల్లి వెళ్లిపోయిందని తెలిపారు. పాఠశాలకు తయారైన శ్రావణీ తన తల్లిదండ్రులు పోలానికి వెళ్లిన తరువాత ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుందని చెప్పారు. అసలు శ్రావణీ ఎందుకు చనిపోయిందో ఎవ్వరికి ఆర్థంకావడం లేదని తెలిపారు. ఆమె చనిపోయిన సమీపంలో తన వాడే పోన్‌ వుందని అందులో వున్న డేటా మొత్తం చెరిపివున్నట్లు ఉందని సమాచారం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎస్‌ఐ గంగరాజు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈమె మృతితో గ్రామంలో విషాద వాతవరణం నెలకొంది.

➡️