ప్రతిభను వెలికి తీయాలి

Sep 29,2024 13:06 #Vizianagaram district

ప్రజాశక్తి-విజయనగరం కోట : విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని డిప్యూటీ డీఈవో వెంకట్రావు అన్నారు. ఆదివారం నాడు స్థానిక పి ఎస్ ఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే తెలివితేటలు సృజనాత్మకతను మెరుగుపరచడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి అన్నారు. ఎంఈఓ ఆనందమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ గణితం, విజ్ఞాన శాస్త్రంలో విషయపరిజ్ఞానం కోసం ఏర్పాటు చేయబడిందే ఈ విజ్ఞాన ప్రదర్శన అన్నారు. స్కూల్ కరస్పాండెంట్ పాకలపాటి సన్యాసిరాజు మాట్లాడుతూ ఇందులో విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత విజ్ఞాన శాస్త్రంకు సంబంధించిన 150 ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగిందన్నారు. ఇందులో 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జి ఎస్ కృష్ణ, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️