ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి అర్భన్ డవలప్మెంట్ అథారిటీ (బుడా) చైర్మన్‌గా తెంటు లక్ష్మునాయుడు (రాజా) బాధ్యతలు స్వీకరించారు. బుడా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బుడా పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కషి చేస్తామని తెంటు రాజా అన్నారు. బుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజాకు మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మరిశర్ల రామారావునాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కోటలో కూటమి నేతలు, కార్యకర్తలు రాజాను కలిసేందుకు క్యూ కట్టారు. జనసందోహంతో కోట కలకళలాడింది.