బుడా చైర్మన్ గా తెంటు బాధ్యతలు స్వీకరణ

Nov 27,2024 11:49 #Vizianagaram district

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి అర్బన్ డవలప్మెంట్ అథారిటీ(బుడా) చైర్మన్ గా తెంటు లక్ష్మునాయుడు(రాజా) బాధ్యతలు స్వీకరించారు. బుడా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన, టీడీపీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. బుడా పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెంటు రాజా అన్నారు. బుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాజాకు మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, ఏఎంసి మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పుడపగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

➡️