ప్రజాశక్తి- గంట్యాడ : గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు పుట్టి బాలింతైన వరకూ సుమారు వెయ్యి రోజులు మహిళలకు కీలకమని, ఆరోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఐసిడిఎస్ పిఒ డి.ఉమాభారతి, పెద్దమజ్జిపాలెం పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ పల్లవి అన్నారు. పౌష్టికాహార పక్షోత్సవంలో భాగంగా మంగళవారం గంట్యాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెదమజ్జిపాలెంలో ర్యాలీ నిర్వహించి గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు నమోదు నుంచి రెండు సంవత్సరాలలోపూ పిల్లలు పెరిగినంత వరకూ పోష్టికాహారం తీసుకోవాలన్నారు. రక్తహీనత రాకుండా నివారించాలంటే ఏం చేయాలో వివరించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతాలు చేశారు. ఈ కార్యక్ర మంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలిం తలు తదితరులు పాల్గొన్నరు. లక్కవరపుకోట: మండలంలోని రంగరాయపురంలో అంగన్వాడి ఎల్‌కోట సెక్టార్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి పోషణ పక్వాడపై మంగళవారం గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శిశువులు పోషణ గురించి పిల్లలు ఎదుగుదల గురించి ఏఏ పోషక ఆహారం తీసుకోవాలని ఆమె వివరించారు. శిశువుల్లో ఇన్స్‌పెక్షన్ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని పిల్లలు తల్లిలకు వివరించారు. ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ పక్షోత్సవాల్లో భాగంగా పలు గ్రామాలు గృహాలకు సందర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
