ప్రజాశక్తి – నెల్లిమర్ల : స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరు సమిష్టిగా పని చేయాలని టిడిపి నియోజకవర్గం ఇంచార్జి, మార్క్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. బుధవారం నెల్లిమర్లలో టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో బూత్ యూనిట్, క్లస్టర్ ఇంఛార్జిలు, మండల/నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కుటుంబ సాధికార సారధుల నియామకంపై, సభ్యత్వం కార్డులు, ఓటర్ లిస్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు త్వరితగతిన కుటుంబ సాధికార సారధుల, పార్టీ అనుబంధ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఎన్నికల స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరూ అసంతృప్తి చెందవద్దని ఓపిగ్గా ఉండాలని రానున్న రోజుల్లో పార్టీ ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గం డెకాండ మాజీ ఎంపిపి కంది చంద్రశేఖరావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాద్ రావు, నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ, పూసపాటి రేగ మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, కర్రోతు సత్యనారాయణ, పల్లె భాస్కర్ రావు, మహంతి శంకర్రావు, పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్లమెంట్ కార్యదర్శి లంక అప్పలనాయుడు, ఎస్‌సి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చీకటి సుహాసిని, గరికిపేట పార్టీ అధ్యక్షులు చింతపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
