మినీ రిజర్వాయర్ నిర్మాణం గాలికి వదిలేసారు

Apr 1,2024 16:36 #Vizianagaram

ప్రజాశక్తి-వేపాడ  : వేపాడ మండలం వీలు పరితి రెవెన్యూ పరిధిలో గల బోడిమెట్ట పంది మిట్ట మధ్య మినీ రిజర్వాయర్ నిర్మాణమునకు విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు డైరీ నుంచి ఆరు కోట్లు నిధులు మంజూరు చేసి ఆ నిధులతో రిజర్వాయర్ నిర్మాణం పనులు పూర్తి చేస్తే సుమారు మూడు మండలాలు రైతులకు పంటలు పండించుకొనుటకు విశాఖ డైరీ తులసీరామ్ ముందుకు వచ్చారు. అప్పటి స్థాయికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కృషి కూడా ఇందులో ఒక భాగమే. మినీ రిజర్వాయర్ నిర్మాణం వలన రైతులకు ఎంతవరకు ప్రయోజకలుగుతుందని అప్పటి జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ పరిశీలన కూడా చేయడం జరిగింది. కలెక్టర్ కూడా మినీ రిజర్వాయర్ నిర్మాణమునకు ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది ఇంతలో ఏమి జరిగిందో మినీ రిజర్వాయర్ పనులు మాత్రం జరగలేదు, అధికారంలోకి వచ్చిన వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రాజెక్టు పూసే ఎత్తలేదు. సమావేశాలను ప్రసంగాల్లో మాత్రం మా ప్రభుత్వం రైతుల పక్షపాతి. రైతులు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అంటూ వదల కొట్టడమే తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదు, స్థానిక ప్రజాప్రతిని కూడా సర్వే నెంబరు 33, సర్వేనెంబర్ 2 లో ఉన్న కొండలను రిగ్ బ్లాస్టింగ్ చేస్తూ, క్వారీ యజమానులు వారికి నచ్చిన రీతిలో స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మకై ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని గండి కొడుతూ దోస కూడా తింటున్నారు, క్వారీలు వలన ప్రాంతాల్లో ఉన్న రైతులు పంటలు భారీగా నష్టం వాటిల్లుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేకంగా, పరిశీలన చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని పలువురు పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️