క్రాస్‌ ప్రోగ్రామ్‌ సద్వినియోగం చేసుకోవాలి

Mar 10,2025 21:27

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండల వాసులు క్రాస్‌ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకువాలని ఎంపిపి అంబళ్ల సుధారాణి కోరారు. సోమవారం ఆమె స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో క్రాస్‌ ప్రోగ్రాం వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిపి మాట్లాడుతూ వేసవి నీటి ఎద్దడి నివారణకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వం క్రాస్‌ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా మరమ్మత్తులకు గురైన చేతి బోర్లను గర్తించి క్రాస్‌ ప్రోగ్రాం ద్వారా బాగుచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కె.రామకృష్ణరాజు, అంబళ్ల శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.పూసపాటి రేగ: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు క్రాస్‌ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని ఎంపిపి మహంతి కళ్యాణి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద క్రాస్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మరమ్మత్తులతో ఉన్న తాగునీటి పథకాలను మరమ్మత్తులు చేయించుకోవాలని ప్రజాపతినిధులకు తెలిపారు. బోర్లు మరమ్మతులకు సామాగ్రి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రాధిక, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి హేమంత్‌, స్థానిక సర్పంచ్‌ టొంపల సీతారాం, నాయకులు మహంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️