బెలూన్స్, కపోతాలను ఎగరవేసి స్పోర్ట్స్ ప్రారంభించిన డిఐజి, ఎస్పి
ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి నెలకొనాలని డిఐజి గోపీనాథ్ జెట్టి అన్నారు. గురువారం నాడు జిల్లా పోలీస్ బ్యారెక్స్ క్రీడ మైదానంలో 31వ వార్షికోత్సవ క్రీడలను బెలూన్స్ ,శాంతి పోతాలను, క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను డిఐజి గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ ను నిర్వహించడం ప్రతి ఆట ఆనవాయితీగా వస్తుందన్నారు పోలీసులు ఇటువంటి క్రీడలు నిర్వహించడం ఎంతో ముఖ్యమన్నారు అన్ని వర్గాల వారికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు. ఫిజికల్ ఆరోగ్యరీత్యా అదే విధంగా వృత్తిరీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు పోలీసు వృత్తులు జాయిన్ అయినప్పుడు ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ ను కొనసాగించాలనుకుంటాం కానీ ఫిట్నెస్తోపాటు మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం అన్నారు. పోలీసు వృత్తులు నిరంతరం తమ మేధస్సును పెంపొందించుకోవలసి ఉంటుందన్నారు స్నేహపూర్వక వాతావరణం క్రీడల ద్వారా పునరుద్ధరించుకోవాలన్నారు . ఒకరితో ఒకరు కుటుంబ విషయాలను పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రీడల్లో గెలుపోవటములు కాదు ముఖ్యం. పాల్గొనడమే ముఖ్యమన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ స్ఫూర్తిగా నిలవాలన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాలు మాట్లాడుతూ ఈ 31వ స్పోర్ట్స్ మీట్ మూడు సంవత్సరాల తర్వాత నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ స్పోర్ట్స్ మిట్ మూడు రోజులపాటు కొనసాగుతుందన్నారు. మూడు సబ్ డివిజన్ వారీగా ఒక రిసర్వ్ డిపార్ట్మెంట్ ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడం జరుగుతుందన్నారు గెలిచిన వారికి పాయింట్స్ వారిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. గెలవడం వాడటం కాదు అందరూ ఒకచోట కలిసినప్పుడు ఏ విధంగా వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. టీం ని ఎలా నడిపించుకోవాలి గెలిపించుకోవాలి అనే వాటిపై చర్చించుకోవడం జరుగుతుందన్నారు డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఇబ్బందులు మెంటల్ టెన్షన్స్ అనేక సమస్యలు ఉంటాయన్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అన్నారు.
400 మీటర్ల పరువు పందాలను ప్రారంభించిన డిఐజి గోపీనాథ్ జెట్టి
స్త్రీ పురుషుల 400 మీటర్ల పరుగు పందాన్ని ప్రారంభించిన డిఐజి గోపీనాథ్ జెట్టి ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ను గాల్లో తుపాకి పేల్చి పరుగుపందన ప్రారంభించారు. ఈ పరువు పందెంలో విజేతలైన ప్రధమ ద్వితీయ తృతీయ విజేతలకు మెడల్స్ సర్టిఫికెట్ బహుమతులు ప్రధానం చేశారు. 400 మీటర్ల పురుషుల్లో ప్రథమ బహుమతి జి రామారావు ద్వితీయ బహుమతి రాజు తృతీయ బహుమతి శ్రీహరి, మహిళా విభాగంలో ప్రథమ బహుమతి వీ . రమణమ్మ, ద్వితీయ బహుమతి కె . రాజేశ్వరి, తృతీయ బహుమతి పి శాల్మన్ . వివిధ పోలీస్ శాఖలు ఏ క్రీడల్లో పాల్గొన్నాయి ఈ క్రీడల్లో పాల్గొన్న అధికారులు డిప్యూటీ ఎస్పీ ససౌమ్య లత, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఇతర ఉన్నత అధికారులు సీఐలు ఎస్సైలు ఇతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు.