ఉపాధ్యాయుల ఉదారత

Jan 9,2025 21:10

ప్రజాశక్తి-రామభద్రపురం : మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉదారతను చాటుకున్నారు. మండలంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థిని, విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా గురువారం స్థానిక ఎంఆర్‌సిలో నూతన దుస్తులను పంపిణీ చేశారు. 15 మంది విద్యార్థులకు ఎంఇఒలు తిరుమల ప్రసాద్‌, పెంటయ్య దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఇఒలు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘ నాయకులు సహకారంతో మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు జెసి రాజు, ప్రసన్న కుమార్‌, బి.రవికుమార్‌, శంకరరావు, కె.శ్రీను, హెచ్‌ఎం కామేశ్వరరావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️