ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్వయం సహాయక సంఘాలకు స్వయం ఉపాధి కల్పనే ధ్యేయంగా నెలలో రెండుసార్లు మార్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అర్బన్ మార్ట్ ను ఆమె ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు అర్బన్ మార్టులు ఏర్పాటు చేసి మహిళా ఉత్పత్తుల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. కమిషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇటువంటి మార్టులు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో టిపిఆర్‌ఒ సింహాచలం, సిటి మిషన్ మేనేజర్ సన్యాసిరావు పాల్గొన్నారు.
