శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

Mar 11,2025 21:02

ప్రజాశక్తి – వేపాడ : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ వసతి గృహాల జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌.రూపావతి అన్నారు. మండలంలోని బక్కునాయుడుపేట డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ సందర్శించారు. ఈ నెల 17వ తేదీ నుండి జరుగునున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల కోసం ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు ఎలా రాశారని ఆరా తీశారు. ఇంటర్‌ విద్యార్థులతో పాటు పదో తరగతి విద్యార్థులు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం మెస్‌కు వెళ్లి భోజనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అకాడమిక్‌ రిజిస్టర్లు తనిఖీ చేశారు. పరీక్షా సమయంలో పిల్లలకు రాత్రి పూట పాలు, బిస్కెట్లు, పళ్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రిన్సిపల్‌ ఉషారాణికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీ పాల్గొన్నారు.

➡️