ప్రజాశక్తి- తెర్లాం: స్థానిక రైస్ మిల్లును ఆర్‌డిఒ రామ్మోహన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతులు నుంచి ఎంత మేరకు ధాన్యం సేకరించారు. ఇంకా సేకరించవలసిన టార్గెట్ ఎంత అని యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం అన్‌లోడ్ చేసి రైతులను వెంటనే పంపించాలని సూచించారు. వాతావరణం సరిగా లేని కారణంగా రైతులకు ఏ విధమైన ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హేమంత్ కుమార్, ఆర్‌ఐ కృష్ణమూర్తినాయుడు, విఆర్‌ఒ గౌతమి తదితరులు పాల్గొన్నారు.