సంక్షేమ బోర్డును సక్రమంగా అమలు చేయాలి

Sep 28,2024 21:05

ప్రజాశక్తి – వంగర : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 1న రాజాంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన, లేబర్‌ ఆఫీసు వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని అరసాడ, నీలయ్యవలస, సంగాం, మగ్గూరు, ఎం సీతారాంపురం తదితర గ్రామాలలో శనివారం ఆటో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్న చోటకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న క్లయములను వెంటనే పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్‌ చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, డిమాండ్‌ చేశారు. అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లుగా గత ప్రభుత్వం రూ.450 కోట్లు నిర్మాణ రంగకార్మికుల తాలూక డబ్బులను దారి మళ్లించిందని విమర్శించారు. ప్రస్తుతం ఉచిత ఇసుక లేక కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణం ఉచిత ఇసుకను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఐలాడా జగన్మోహన్‌, భవనిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు ఆదినారాయణ, గౌరునాయుడు, రామారావు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️