‘ఆ’ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి 

Sep 30,2024 13:37 #Vizianagaram district

ఐటిడిఏ ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజనులు ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లాలో రామాబాద్రపురం, మెంటాడ, వేపాడ, ఏస్, కోట, మండలల్లో వెలమంది ఆదివాసులు ఏటువంటి సదుపాయం లేక కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఐటిడిఎ లేనందున ఆదివాసీల సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మారుమూల గ్రామాల్లోని నివసించే అధివాసిలకు రోడ్లు, మంచినీరు మౌలిక సదుపాయలు విద్య, వైద్య సేవలు అందక నేటికీ దోలి మోతలతో హాస్పిటల్ కు వస్తు ప్రాణాలు పోగొట్టు కొనే పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీ సమస్యలు పరిస్కరించుటకు తక్షణమే విజయ నగరం జిల్లా కేంద్రంగా ఐటిడిఎ ఏర్పాటు చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అవినాష్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతికుటుంబానికి 10 ఎకరాలు బూమి ఇవ్వాల్సి ఉండగా, ఏళ్ల తరబడి నుండి సాగులో ఉండి కూడా పట్టాలు ఇవ్వకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. సాగులో ఉన్న ప్రతి ఆదివాసి కుటుంబనికి పొదుపట్టలు అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఆండ్ర రిజర్వాయర్ లో చేపలు పట్టుకుని జీవన సాగించే ఆదివాసులకు సొసైటీ ఏర్పాటు చేసి అన్ని రకాల సహకారం అందించి ఆదివాసీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తుందన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో లేని గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి. విజయనగరం జిల్లాలో ఆదివాసీలకు ఐటిడిఎ ఏర్పాటు చెయ్యాలన్నారు. సాగులో ఉన్న ఆదివాసులకు అటవిహక్కు చట్టం ప్రకారం 10 ఎకరాలు బూమి పట్ట ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. మారుమూల ఆదివాసీ గ్రామాలకు మంచినీరు, రోడ్లు మౌలిక వసతులు కల్పించాలనీ, మెంటాడ, రిజర్వర్ పరిదిలో సేపలు పట్టి జీవనం సాగించే ఆదివాసులకు సొసైటీలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలనీ డిమాండ్ చేశారు. ధర్నాలో రాకోటి రాములు, సురేంద్ర, టి.సోములు, బంగారయ్య, రామారావు గిరిజనులు పాల్గొన్నారు.

➡️