ప్రజాశక్తి-విజయనగరం కోట : సమాజ ఉద్ధరణకు ఎంతో సేవ చేసిన జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం నాడు స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డి ఆర్ వో శ్రీనివాసరావు. బీసీ వెల్ఫేర్ ఇన్చార్జ్ ఆఫీసర్ పెంటోజీరావు పాల్గొని పూలేకు ఘన నివాళులర్పించారు.