ప్రజాశక్తి- చీపురుపల్లి : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న కోరెడ్ల విజయగౌరీ గెలుపునకు నాలుగు మండలాల యుటిఎఫ్ నాయకులు విస్తృతంగా గత పది రోజుల నుండి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతిరోజు పాఠశాలలను విడిచిపెట్టిన సాయంత్రం పూట యుటిఎఫ్ నాయకులు ఓట్లు ఉన్న ఉపాధ్యాయుల ఇళ్లకు వెల్లి విజయగౌరీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటం చేస్తున్న విజయగౌరిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుటిఎఫ్ నాయకులు ఓటర్లకు వివరిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయ ఓటర్లను యుటిఎఫ్ నాయకులు కలిసి విజయగౌరిని గెలిపించాలని కోరుతున్నారు. నియోజ కవర్గంలో సుమారు 316 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. ఈనెల 27వ తేదీన జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రచారంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు డి రాము, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎ సత్యశ్రీనివాస్, జిల్లా గౌరవాద్యక్షుడు మీసాల అప్పల నాయుడు, జిల్లా కార్యదర్శి ముదునూరు రఘునాధ రాజు, నాలుగు మండలాల యుటిఎఫ్ అద్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.విజయగౌరిని గెలిపించండివేపాడ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి కె.విజయగౌరీని గెలిపించాలని యుటిఎఫ్, ప్రజా సంఘాల నాయకులు ఆదివారం వేపాడ, వల్లంపూడి, ఆకుల సీతంపేట, అరిగిపాలెం, బొద్దాం గ్రామాల్లో ఇంటింట ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి పిడిఎఫ్ అభ్యర్ధి కె.విజయగౌరికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఐ.జగదీశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఆర్.రామసత్యం, సిఐటియు నాయకులు చల్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.
