ప్రజాశక్తి-విజయనగరంకోట : భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకు ముందు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డితో కలిసి వడ్డే ఓబన్న బ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓబన్న చరిత్రను, వీరగాథను భావితరాలు స్మరించే సంకల్పంతో రాష్ట్ర పభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు . కార్యక్రమంలో రాష్ట తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి , జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి పెంటోజీ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.