ప్రజాశక్తి-విజయనగరంకోట : ఎపి మార్కెఫెడ్ జిల్లా మేనేజర్‌గా ఎన్.వెంకటేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు ఉద్యానశాఖలో విధులు నిర్వహిస్తూ, డిప్యుటేషన్‌పై డిఎంగా చేరారు. ఇంతకుముందు ఈ స్థానంలో వై.విమలకుమారి డిఎంగా పనిచేసి, పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ముందుగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కలిసి అనుమతి తీసుకున్న అనంతరం వెంకటేశ్వర్రావు డిఎంగా బాధ్యతలు స్వీకరించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/mark-fed.jpg)