ఒమ్మిలో పశు వైద్య శిబిరం

Jan 22,2025 21:35

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని ఒమ్మిలో బుధవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్‌, జనసేన నాయకులు అంబళ్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో పశువైద్యాధికారి ప్రవీణ్‌ శిబిరం నిర్వహించి తనిఖీ చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశువుల ఆరోగ్యం పై దృష్టి సారించి దిగుబడి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వెటర్నరీ అసిస్టెంట్‌ నారాయణరావు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. బొబ్బిలిరూరల్‌: మండలంలోని చింతాడ, కారాడ గ్రామాలలో బుధవారం పశువైద్య శిబిరాన్ని పక్కి, పిరిడి పశు వైద్యాధికారులు సుధాకర్‌, అనితల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో అనారోగ్య పశువులకు చికిత్సలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ, చూడి తనిఖీలు నిర్వహించి 546 పశువులకు చికిత్సలు, 1000 గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు వేశామన్నారు. ఈ నెల 23న నారశింహుని పేట, కమ్మవలస గ్రామంలో పశుఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.మెరకముడిదాం: మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని మండల పశువైద్యధికారి సిహెచ్‌ హైమావతి తెలిపారు. బుధవారం మండలంలోని ఉత్తరావిల్లి, జి. మర్రివలస పంచాయతీల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 1568 పశువులకు, 883 సన్నజీవులకు నట్టల మందు వేసామని, 9పశువులకు ఎద ఇంజంక్షన్లు, 28పశువులకు చూడు పరీక్షలు నిర్వహించామని ఆమె తెలిపారు. 860 ఎదకురాని, చూలు కట్టని పశువులకు, గర్భకోస వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసామని, 600సన్న జీవాలకు షీప్‌పాక్స్‌, గోట్‌ పాక్స్‌ టీకాలు, 800 కోళ్లకు పౌల్‌ పాక్స్‌ టీకాలు వేసామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.లక్కవరపుకోట: మండలంలోని కిత్తన్నపేటలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించినట్లు పశువైద్యాధికారి డాక్టర్‌ కోరాడ గాయత్రి తెలిపారు. ఈ శిబిరంలో ఐదు కృత్రిమ గర్భÛధారణ ఇంజక్షన్లు, పది చూలు తనిఖీలు, 22 గర్భకోస వ్యాధులకు చికిత్సలు, 20 సాధారణ చికిత్సలు, 800 గొర్రెలు, మేకలకు, 55 పెయ్యిలు, 46 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. ఈ శిబిరంలో సర్పంచ్‌ దుక్క వెంకటరావు పాల్గొన్నారు.

➡️