ప్రజాశక్తి-బొబ్బిలి : పట్టణంలోని రైల్వేస్టేషన్ నూతన భవనం వద్ద మున్సిపల్ పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. మల్లమ్మపేట ప్రజలకు తాగునీరు సరఫరా చేసే సబ్ పైపులైన్ లీకవడంతో సంపూర్ణంగా తాగునీరు అందడం లేదు. ఇదే ప్రాంతంలో పలుమార్లు పైపులైన్ లీకవుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి లీకులను నివారించాలని మల్లమ్మపేట ప్రజలు కోరుతున్నారు.
