ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి తొలిసారి విజయనగరం వచ్చిన అవనాపు విక్రమ్, భావన దంపతులకు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం స్థానిక వై జంక్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. నగరంలో, జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.