ఆక్రమణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

Jun 8,2024 12:19 #Vizianagaram

ఎమ్మెల్యే బేబినాయన

ప్రజాశక్తి-బొబ్బిలి : గుర్రపు కోనేరు ఆక్రమణపై చర్యలకు పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే బేబినాయన ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన గుర్రపు కోనేరును శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన గుర్రపు కోనేరు మధ్యలో ఉన్న ఆలయ మండపంలో పురాతన విగ్రహాలు చోరీ చేసి కోనేరు ఆక్రమణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పురాతన విగ్రహాలు చోరీపై హిందూ ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు పిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విగ్రహాలు చోరిపై చర్యలు తీసుకోకుండా కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. గుర్రపు కోనేరు వద్ద పర్మినెంట్ నిర్మాణం చేపట్టిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, పురాతన విగ్రహాలు చోరీపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️