సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం

Mar 13,2025 20:57

ప్రజాశక్తి-బాడంగి : సమాజ అభివృద్ధిలో మహిళలే కీలకమని డిఎస్‌పి భవ్యరెడ్డి తెలిపారు. బాడంగి సమీపంలోని దీక్షా మహిళా వెల్ఫేర్‌ సొసైటీ కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ సిఇఒ ఎల్‌.శాంతి ఆధ్వర్యాన నాబార్డు డిడిఎం టి.నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిఎస్‌పి మాట్లాడారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు ఎదుగుతున్నారని చెప్పారు. కుటుంబంతో పాటు సమాజాన్ని అన్ని విధాలా క్రమశిక్షణతో ముందుకు నడపడంలో మహిళల ప్రాధాన్యత అధికమని తెలిపారు. నాబార్డు డిడిఎం నాగార్జున మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందినప్పుడే దేశం, కుటుంబం బాగుపడతాయన్నారు. జట్టు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు డి.పారినాయుడు, ఎఒ శిరీషా, ఆర్ట్స్‌ డైరెక్టర్‌ సన్యాసిరావు, ఏకలవ్య సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలవలస గౌరు మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్‌పి భవ్యరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కెజిబివి ప్రిన్సిపల్‌ హారిక, డాక్టర్‌ ప్రత్యూష, బ్యాంకు ఉద్యోగి ప్రజ్ఞ, అక్షయ సిఇఒ లక్ష్మి పద్మ పార్వతి, ఎస్‌ఐ తారకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️