ఉదయం ఏడు గంటల నుంచి రోడ్డు మీద ఉన్న మహిళలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఉత్సవాలు నేపద్యంలో ఆదివారం చేపట్టనున్న ర్యాలీకి వచ్చిన పొదుపు సంఘాలు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం ర్యాలీ కోసం ఏడు గంటలకు వచ్చేయాలని చెప్పడంతో ఉదయం ఇళ్ల నుంచి ఆరున్నర గంటలకు బయలుదేరి ఎంజీ రోడ్డు కు చేరుకున్నారు. వార్డు లు వారీగా మూడు లాంతర్లు నుంచి కన్యాకపరమేశ్వరి కోవెల వరకు క్యూలో ఉంచారు. పది గంటలు వరకు ర్యాలీ ప్రారంభం కాకపోవడంతో ఉదయం నుంచి వచ్చిన వారు టిఫిన్లు లేక, నీరు ఇచ్చే దాతలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
