వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

Oct 1,2024 21:11

ప్రజాశక్తి- బొబ్బిలి : చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని వైడిఒ ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.శ్రీకాంత్‌ బాబు అన్నారు. స్థానిక రిషి జూనియర్‌ కళాశాలలో మంగళవారం డ్రగ్స్‌, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌ వల్ల జీవితాలు నాశనమవుతాయని, దూరంగా ఉండాలని కోరారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ ఎలా వ్యాపిస్తుందో అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.శృంగవరపుకోట: యువత మాదకద్రవ్యాల అలవాటు వల్ల భవిష్యత్తు బానిసత్వం అవుతుందని సిఐ వి.రమణమూర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణమండపంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌ వాడకం వల్ల జరిగే దుష్పరినామాలపై అవగాహన కల్పించారు. ఎన్‌డిపిఎస్‌ చట్టాల గురించి వీడియోలు, పాంప్లెట్స్‌, ఫ్లెక్సీల రూపంలో, క్విజ్‌ రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం యాంటీ డ్రగ్స్‌ కమిటీ, డ్రగ్స్‌ కంప్లైంట్‌ బాక్స్‌ను కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గంగరాజు, పోలీస్‌ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.వంగర: మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ అన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మడ్డువలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు చిత్తవుతాయని వివరించారు. అనంతరం కళాశాలలో ఫిర్యాదులు పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె. నారాయణ రావు, బలగ పోలినాయుడు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.వేపాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం విద్యార్థులు డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ఎస్‌ఐ బి. దేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గరివిడి : స్థానిక అవంతీస్‌ సెయింట్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.జాషువా జయప్రసాద్‌ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చీపురపల్లి డిఎస్‌పి ఎస్‌.రాఘవులు పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్‌తో యువత, విద్యార్థుల జీవితాలు నాశనం అవుతు న్నాయని, డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యా ర్థులు మత్తు పదార్థాల వేటలో పడి అసాంఘిక కార్యక్ర మాలకులోనై జైలు జీవితానికి గురి కావద్దని హెచ్చరించారు. చీపురుపల్లి సిఐ జి.శంకర రావు మాట్లాడుతూ యువత గంజాయి, కొకైన్‌, హఫీష్‌, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. అనంతరం కళాశాలలో సంకల్పం అనే ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు, వైస్‌.ప్రిన్సిపాల్‌ బి.వెంకటరమణ, ఎఒ అనిల్‌ కుమార్‌, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️