గ్రావిల్‌ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

ప్రజాశక్తి – ఉంగుటూరు (ఏలూరు) : పోలవరం కాలవ గట్టు కంసాలిగుంట వద్ద అనుమతులు లేకుండా సోమవారం రాత్రి గ్రావిల్‌ తవ్వుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు . పోలవరం కెనాల్‌ ఏఈ బాపూజీ ఆధ్వర్యంలో సిబ్బంది లారీలను సీజ్‌ చేసి చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. కంకరను తవ్విన పెద్ద మిషన్‌ ను సంఘటనానికి దూరంగా ఉంచారని ఆ మిషన్‌ యజమాని ఎవరనేది ఎంక్వైరీ చేస్తున్నామని ఇరిగేషన్‌ ఏ ఈ బాపూజీ పేర్కొన్నారు.

➡️