గురజాడ అప్పారావు 109వ వర్ధంతి

Nov 30,2024 13:40 #Visakha

ప్రజాశక్తి-అచ్యుతాపురం : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో కైట్స్ ,ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మంగతాయారు మాట్లాడుతూ గురజాడ వెంకట అప్పారావు కళారూపాలు పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ ,కన్యాశుల్కం కళారూపాలతో ప్రజలు నాకట్టుకుండేలాగా వరకట్న వేధింపులు, బాల్యవివాహాలు అరికట్టాలని స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా బాగా చదువుకొని ఈ సమాజం మార్పిడి కి తోడ్పడాలని ఎంతో కృషి చేసారు గురజాడ అప్పారావు గారు మహా ఉన్నతమైన గొప్ప వ్యక్తి మహిళల కోసం అనేక రూపాల్లో పాటల పద్యాలు రూపాలతో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ పద్యాలు రాసి ఈ సమాజాన్ని మార్పు కావాలని కృషి జరిపారు ఆయన బాటలో నేటి యువత యువకులు పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కే. సోమినాయుడు, సాయి శంకర్, రామ్ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️