అభిజిత్ ఫెర్రోటెక్ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి

సిఐటియు డిమాండ్  

ప్రజాశక్తి-విశాఖ: అచ్చుతాపురం ఎస్సీ జడ్ లో ఉన్న అభిజిత్ ఫెరోటెక్లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమ గేటుకు లాకౌట్ చేస్తున్నట్టు నోటీసు అతికించారు. దీనిని నిరసిస్తూ పరిశ్రమ గేటు వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గేట్ వద్ద జరుగుతున్న ధర్నా నుద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కన్వీనర్ కే .సోమినాయుడు మాట్లాడుతూ ఎస్సీజడ్లు వస్తే కార్మికుల జీవితాలు మారిపోతాయి అని చెప్పిన అధికారులు నేడు కార్మికులతో సంప్రదించకుండా వాళ్ళిష్టానుసారం ఈరోజు ఉదయం విధులకు వెళుతున్న కార్మికులను గేటు వేసి బయటపెట్టారు. దీనిపై ప్రభుత్వం కలుగజేసుకొని కార్మికులకు పాత పద్ధతిలో పనులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభిజిత్ కార్మికులు, ఉద్యోగులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.

➡️