ముడసర్లోవ పార్కులో కాకుల మృత్యువాత

ముడసర్లోవ పార్కులో కాకుల మృత్యువాత

ప్రజాశక్తి – ఆరిలోవ : ముడసర్లోవ పార్కులో కొన్నాళ్లుగా కాకులు, కొంగలు మృత్యువాత పడుతున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు కాకులు, కొంగలు మృతి చెందడాన్ని పార్కులో సిబ్బంది గుర్తించారు. సోమవారం కూడా మూడు కాకులు చనిపోగా, మరో రెండు కాకులు అస్వస్థతకు గురై ఎగరలేకపోవడం, అరవక పోవడాన్ని గుర్తించి పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెటర్నరీ సిబ్బంది పార్కుకు వచ్చి మృతి చెందిన కాకులతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వాటికి వైద్యం అందించార. కాగా కాకుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, వాటి మృతికి కారణాలను విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటామని వెటర్నరీ ఎడి డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా పార్కులో సందర్శకులు పడేసి, నిల్వ ఉన్న ఆహారపదార్థాలను తినడం వల్ల అస్వస్థతకు గురై మరణించి ఉంటాయని ప్రాధమికంగా గుర్తించినట్లు తెలిపారు.

పార్కులో చనిపోయిన, అస్వస్థతకు గురైన కాకులు

➡️