ప్రజాశక్తి-విశాఖ: ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో మరో విద్యార్థిని ఆత్మహత్య పాల్పడి మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రెడ్డికంచరపాలెంలో నివాసం ఉంటున్న నిహారిక (16)ఉమెన్స్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో జువాలజీ సబ్జెక్టు పాస్ కాకపోవడంతో మనస్థాపం చెందింది. దీంతో ఈరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి గమనించి కిందికు దించి చూడగా అప్పటికే ఆమె చనిపోయింది. కంచరపాలెం ఉమెన్ ఎస్సై దివ్యభారతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
