బడ్జెట్ పత్రాలు దగ్ధం

Feb 5,2025 13:05 #in Visakha

ప్రజాశక్తి-చోడవరం : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి మొండిచేయి చూపించేన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను రైతు సంఘం ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో రైతాంగానికి పూర్తిగా మొండిచేయి చూపించి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని C2+ 50 అమలు చేయాలని విత్తనాలు పురుగు మందులు పైన సబ్సిడీ ఇవ్వాలని సోమనాథుని కమిషన్ కమిటీ నిర్ణయించిన మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నో సందర్భాల్లో దేశీయాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి పూర్తిగా ముండే చెయ్య చూపించారని దీనికి నిరసనగా ఈరోజు బడ్జెట్ ప్రతులుని తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విస్సారూపునాగూరు శనివాడ శ్రీనివాస్ రావు, గణేషు మరియు రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️