వెదురువాడలో భూ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం వినతి  

Dec 11,2024 12:37 #Visakha, #vizag

ప్రజాశక్తి-వెదురువాడ : వెదురువాడ సర్వేనెంబర్ 1లో 143 మంది పేదలకు 100 ఎకరాలు 2005లో అప్పటి ప్రభుత్వం దళితులు, వృత్తిదారులు కూలీలకు భూములు పంచి డి-ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ భూముల్లో జీడి మామిడి మొక్కలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ భూములకు సబ్ డివిజన్ చేసి హద్దులు వేసి ఇవ్వాలని, ఏపీఐఐసీ పేదల భూముల్లో జీడి మామిడి మొక్కలను తొలగించారు. వీరి భూములు తీసుకొని నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదు. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసి పేదలకు న్యాయం చేయాలని రెవిన్యూ సదస్సులో డిప్యూటీ తహసిల్దార్ శ్యామ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్.రాము, బాధితులు కిల్లాడి బాపూజీ, సత్యనారాయణ, లక్ష్మి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️